
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణంలో వాతావరణంపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని.. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. శ్రీలంకకు దక్షిణాన నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం, ఇప్పుడు దక్షిణ శ్రీలంక – దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి వైపు వంగి ఉంది. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు