గూగుల్ మ్యాప్స్‌లో హైదరాబాద్ మెట్రో రియల్‌ టైమ్ సేవలు
హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.)హైదరాబాద్ మెట్రో రైలు రాకపోకల సమయాలు ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో రియల్‌ టైమ్‌గా కనిపిస్తాయని తెలంగాణ సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మెట్రో సేవలకు సంబంధించిన సమగ్ర డేటాను ప్రభుత్వం ఓపెన్, స్టాండర్డ్ జీటీఎఫ్
గూగుల్ మ్యాప్స్‌లో హైదరాబాద్ మెట్రో రియల్‌ టైమ్ సేవలు


హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.)హైదరాబాద్ మెట్రో రైలు రాకపోకల సమయాలు ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో రియల్‌ టైమ్‌గా కనిపిస్తాయని తెలంగాణ సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మెట్రో సేవలకు సంబంధించిన సమగ్ర డేటాను ప్రభుత్వం ఓపెన్, స్టాండర్డ్ జీటీఎఫ్‌ఎస్‌ ఫార్మాట్‌లో విడుదల చేయడంతో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. ఓపెన్ డేటా తెలంగాణ పోర్టల్–హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంయుక్తంగా సిద్ధం చేసిన పూర్తి జీటీఎఫ్‌ఎస్‌ డేటాసెట్‌లో మూడు కారిడార్లు, 118 స్టేషన్లు, వారానికి 6,958 ట్రిప్‌ల వివరాలు ఉన్నాయని మంత్రి చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande