
కోల్కత్త, 14 నవంబర్ (హి.స.)
కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు వార్ వన్ సైడ్ లా ముగిసింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయం పూర్తిగా ఫలితాన్ని ఇచ్చింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం బాగానే కనిపించినా.. ఆ తర్వాత భారత బౌలర్లు విజృభించడంతో వికెట్లు వరుసగా కోల్పోయింది. దక్షిణాఫ్రికా తరఫున ఐడెన్ మార్క్రామ్ (31), రికెల్టన్ (23), డే జోర్జీ (24), ముల్డర్ (24) మాత్రమే కొంత ప్రతిఘటన చూపగలిగారు. మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్ ముందు తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా జహ్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను తక్కువ పరుగులకే పరిమితం చేశాడు. ఇక మిగితా భారత బౌలర్స్ లో మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. 159 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలో జాగ్రత్తగా ఆడింది. టీమిండియా ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ (12) త్వరగా ఔటవ్వగా.. కెఎల్ రాహుల్ (13*), వాషింగ్టన్ సుందర్ (6*) జాగ్రత్తగా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లలో 37/1 పరుగులు చేసింది. ఇంకా 122 పరుగులు వెనుకంజలో ఉంది. ఇక రెండో రోజు తొలి సెషన్ ఈ మ్యాచ్ దిశను నిర్ణయించనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..