
చెన్నై, 14 నవంబర్ (హి.స.)
భారత వైమానిక దళానికి చెందిన ఓ
శిక్షణా విమానం తమిళనాడులో కుప్పకూలింది. సింగిల్ సీటర్ ట్రైనర్ విమానం చెన్నై (Chennai)లోని తాంబరం ఎయిర్ బేస్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సింగిల్ సీటర్ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. అయితే స్థానికులు తక్షణమే అక్కడికి చేరుకొని.. ప్రమాదంలో చిక్కుకున్న పైలట్ను బయటికి తీసుకు వచ్చారు. కాగా ప్రమాద స్థలానికి చేరుకున్న వైమానిక అధికారులు.. సాధారణ శిక్షణా సమయంలో ప్రమాదవశాత్తూ విమానం కూలిపోయినట్లు అంచనా వేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..