
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారని.. ఈ గెలుపు రెండేళ కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుపై ఆయన స్పందిస్తూ.. జూబ్లీహిల్స్‌లో విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
‘‘ఈ గెలుపు నా బాధ్యతను మరింతగా పెంచింది. హైదరాబాద్ ప్రజలు మాకు అండగా నిలిచారు. బాధ్యతతో ముందుకు వెళ్ళమని మమల్ని ప్రజలు ఆశీర్వదించారు. గెలుపులో భాగమైన అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు. గెలుపులో అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం మాకు తెలియదు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాటంలో భాగం అవుతాం. అధికారంలో ఉంటే ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. దశాబ్ద కాలంగా ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు