
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో వివాదాస్పద ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా 'Karma hits back !!!' (కర్మ అనుభవించాల్సిందే) అంటూ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం కవిత చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ కవిత ఎవరినీ ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు?, ఆ ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటి?, బీఆర్ఎస్ ఓటమిని ఉద్దేశిస్తూ ఆమె ఈ ట్వీట్ చేశారా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల మీడియా ముందుకు వచ్చి మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ కుమార్ పై కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు