
ఖమ్మం, 14 నవంబర్ (హి.స.)
పత్తి మొక్కజొన్న సాగుకు బదులు
పామాయిల్ సాగుతో రైతులకు లాభాలు వస్తాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి రఘునాధపాలెం మండలంలో శుక్రవారం పర్యటన సందర్భంగా మార్గమధ్యలో రజబ్ అలీనగర్ గ్రామంలోని పొలాలను సందర్శించారు. బాణోత్ వీరన్న కు చెందిన పొలం వద్దకు వెళ్లి, ఏ పంట వేస్తున్నది, గతంలో ఎంత దిగుబడి వచ్చింది అడిగి తెలుసుకున్నారు. పత్తి, మొక్కజొన్నల పంటల సాగుకు పామాయిల్ సాగు ప్రత్యామ్నాయంగా చేపట్టాలని మంత్రి రైతులకు వివరించారు. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతు పొలం వద్ద ఆగి పామాయిల్ సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలం లాభాలు ఉంటాయని వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు