
మిర్యాలగూడ, 14 నవంబర్ (హి.స.)
మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి
ఈ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డులలో 70 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పదేళ్లపాటు పదవులు ఏలిన నాయకులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాన్ని అస్తవ్యస్తంగా చేపట్టారని, కాగితాల్లో మాత్రం అభివృద్ధిని ఆకాశానికి చూపించారని ఆరోపించారు. గతంలో జరిగిన తప్పులను గుర్తించి సరి చేసేందుకు తమకు రెండేళ్లు పట్టిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు