
పెద్దపల్లి, 14 నవంబర్ (హి.స.)
రైతులు పంట మార్పిడీతో నే అధిక దిగుబడులను సాధించవచ్చని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు.
వరి సాగుతో పాటు ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని రైతులకు సూచించారు. ఇతర దేశాల నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకోవడం జరుగుతుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు