అర్రివ్ అలైవ్’ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో ‘అరైవ్ & అలైవ్’ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్
అర్రివ్ అలైవ్’ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో ‘అరైవ్ & అలైవ్’ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ అదనపు సీపీ జోయిస్ డేవిస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు, యువత, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.

డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘అర్రివ్ అలైవ్’ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్యగా అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని, ప్రతిరోజూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తు పెట్టుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande