
సూర్యాపేట, 14 నవంబర్ (హి.స.)
మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు భరోసా కల్పించడమే పోలీస్ లక్ష్యమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు, వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..పకడ్బందీ సేవలతో నేరాలను అదుపు చేయడంతో గతంలో కన్నా నేరాల సంఖ్య తగ్గిందన్నారు. సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వినియోగం, దొంగతనాలు దోపిడీలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని నివారించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అశాంతి, అభద్రత భావం లేకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు, హుజూర్నగర్ నియోజకవర్గంలో సేఫ్ హుజూర్ నగర్ లక్ష్యంతో 150 నుండి 200 సీసీ కెమెరాలను, నేరేడుచర్లలో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు