నేడు బిహార్.. రేపు బెంగాల్: కేంద్ర మంత్రి
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)నేడు బిహార్‌లో విజయం సాధించామని.. రేపు పశ్చిమ బెంగాల్‌లో సైతం బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై శుక్రవారం నాంప
నేడు బిహార్.. రేపు బెంగాల్: కేంద్ర మంత్రి


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)నేడు బిహార్‌లో విజయం సాధించామని.. రేపు పశ్చిమ బెంగాల్‌లో సైతం బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి బండి సంజయ్ విలేకర్లతో మాట్లాడారు. బిహార్‌లో స్వాతహాగా బీజేపీ 92 స్థానాల్లో గెలిచిందన్నారు. ఇక బిహార్‌లో కాంగ్రెస్ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పని అయిపోయిందని.. ఇక ఆయన పబ్జి ఆడుకోవాలంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande