
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం రికార్డు విజయాన్ని నమోదు చేసింది. నీతీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కూటమికి ఓటర్లు అఖండ విజయం చేకూర్చారు. 20 ఏళ్లుగా అధికారంలో ఉన్నా ప్రజావ్యతిరేకతను దాటడంలో నీతీశ్ సఫలమయ్యారు. మరీ ముఖ్యంగా మహిళల ఓట్లను ఆకర్షించడంలో కూటమి విజయం సాధించింది. ముఖ్యంగా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ప్రకటించిన ‘రోజ్‌గార్ యోజన’ (అర్హత కలిగిన మహిళలకు రూ.10వేల చొప్పున ఇవ్వడం) బాగా పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో చేసిన ఈ ప్రయోగం.. ఇప్పుడు బిహార్‌లోనూ ‘గేమ్ ఛేంజర్’గా నిలిచిందంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు