
విశాఖపట్నం , 15 నవంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్వ్యాఖ్యానించారు. 6 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ విశాఖకు తీసుకురావాలని ఆలోచన చేశామని వివరించారు. ఇవాళ(శనివారం) సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సమక్షంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం- ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఎనర్జీ సైబర్ రెజిలియన్స్ సెంటర్ ఎంఓయూ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఎండీ జెరెమీ జర్గెన్స్, ఏపీ ప్రభుత్వ సీఎస్ కె.విజయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి నారా లోకేష్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ