
హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.)
ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులులో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించి స్టేట్మెంట్ తీసుకున్న సీఐడీ.. ఇవాళ (శనివారం) సీఐడీ కార్యాలయంలో వీరి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. యాంకర్ విష్ణు ప్రియ మూడు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినట్లు అధికారుల సమాచారం. బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలను విష్ణు ప్రియ CID సిట్ కి అందజేసినట్లు తెలిసింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..