
కోల్కత్తా, 15 నవంబర్ (హి.స.) దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత కెప్టెన్ శుభమన్ గిల్ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. మెడ పట్టేయడంతో అతను మైదానం వదిలి వెళ్లాడు. ఇవాళ ఉదయం తొలి సెషన్లో ఈ ఘటన జరిగింది. రెండో వికెట్ రూపంలో వాషింగ్టన్ సుందర్ ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ గిల్ కేవలం మూడు బంతులు మాత్రమే ఆడాడు. హార్మర్ బౌలింగ్లో స్వీప్ షాట్తో బౌండరీ కొట్టిన గిల్ ఆ తర్వాత బ్యాటింగ్ చేయలేకపోయాడు. మెడ పట్టేయడంతో అతను తల తిప్పలేకపోయాడు. దీంతో రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ బ్యాటింగ్కు వచ్చాడు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు