వుమెన్స్ వరల్డ్ కప్.! భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్ ఫైట్
ముంబై, 2 నవంబర్ (హి.స.) మహిళల వండే ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఫైనల్లో భారత-దక్షిణాఫ్రికా జట్లు నేడు తలపడబోతున్నాయి. నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. ఇప్పటి వరకు రెండు జట్లు ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్ను గెల
క్రికెట్


ముంబై, 2 నవంబర్ (హి.స.)

మహిళల వండే ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఫైనల్లో భారత-దక్షిణాఫ్రికా జట్లు నేడు తలపడబోతున్నాయి. నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. ఇప్పటి వరకు రెండు జట్లు ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్ను గెలువలేదు. ఈ సారి కొత్త జట్టు చాంపియన్గా నిలువబోతున్నది.

సెమీఫైనల్లో రెండు జట్లు కఠినమైన సవాల్ను ఎదుర్కొన్నాయి. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్స్ కు అంత సులభంగా ఏమీ చేరుకోలేదు. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఇంగ్లండ్తో తలపడగా.. భారత జట్టు ఆస్ట్రేలియాను ఢీకొట్టింది. ఏడుసార్లు చాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొంది. ఆసక్తికరంగా గ్రూప్ దశలో ఇంగ్లండ్.. దక్షిణాఫ్రికాను ఓడించినట్లే, ఆస్ట్రేలియా జట్టు గ్రూప్ దశలో భారత్ను ఓడించింది. అయినా, భారత్, దక్షిణాఫ్రికా జట్టు మనోధైర్యం కోల్పోకుండా.. ఆ రెండు జట్లను సెమీస్లో ఓడించి టైటిల్ మ్యాచ్లోకి అడుగుపెట్టాయి. రెండు జట్లు టైటిల్కు అడుగుదూరంలో నిలిచాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande