
హైదరాబాద్, 1 నవంబర్ (హి.స.)
టీమిండి అభిమానులకు బిగ్ రిలీఫ్
దక్కింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) డిశ్చార్జ్ అయ్యాడు. సిడ్నీలో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలో గత వారం రోజులుగా శ్రేయాస్ అయ్యర్ చికిత్స పొందాడు. ఇందులో దాదాపు మూడు రోజులపాటు ఐసీయూలోనే ఉన్నాడు. అయితే ఆయన ఆరోగ్యం మెరుగుపడిందట. దీంతో ఇవాళ ఆసుపత్రి నుంచి శ్రేయాస్ అయ్యర్ ను డిశ్చార్జ్ చేసినట్లు బీసీసీఐ ధ్రువీకరించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రేయాస్ అయ్యర్, నేరుగా ఇంటికి రాబోతున్నట్లు సమాచారం..
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొన్నటి మూడవ వన్డేలో క్యాచ్ పట్టబోయి, గాయం బారిన పడ్డాడు శ్రేయాస్ అయ్యార్. దీంతో ఆ రోజు నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఇక అయ్యర్ డిశ్చార్జ్ అయ్యాడన్న వార్త రాగానే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..