వచ్చేసింది యువరాణి.. క్యాండిడేట్స్ చెస్ విజేత వైశాలి
భారత గ్రాండ్మాస్టర్ వైశాలి రమేష్ బాబు చరిత్ర సృష్టించింది.
Vaishali


పఫోస్ (సైప్రస్), 16 ఏప్రిల్ (హి.స.)భారత గ్రాండ్మాస్టర్ వైశాలి రమేష్ బాబు చరిత్ర సృష్టించింది. ఈ 24 ఏళ్ల చెన్నై స్టార్ ప్రతిష్ఠాత్మక ఫిడే క్యాండిడేట్స్ చెస్ మహిళల టైటిల్ను కైవసం చేసుకుంది. తద్వారా క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన తొలి భారత మహిళగా అరుదైన ఘతన సాధించింది. ఈ విజయంతో చదరంగ యువరాణిగా నిలిచిన వైశాలి.. చాలెంజర్ హోదాలో ప్రపంచ టైటిల్ కోసం డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్మాస్టర్ వెన్జున్తో తలపడేందుకు అర్హత సాధించింది. ఈ ఏడాది ఆఖర్లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ వేదిక, తేదీలను ఫిడే ఖరారు చేయాల్సి ఉంది. ఇక..క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఉజ్బెకిస్థాన్ గ్రాండ్మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ మంగళవారంనాటి 13వ రౌండ్ నాటికే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో ఇద్దరే పోటీపడతారు. ఒకరు డిఫెండింగ్ చాంపియన్.. మరొకరు చాలెంజర్. క్యాండిడేట్స్ టోర్నీ నెగ్గిన వారే చాలెంజర్. క్వాలిఫికేషన్ ప్రక్రియ ద్వారా 8 మంది ఆటగాళ్లను క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక చేస్తారు. రెండేళ్ల క్రితం క్యాండిడేట్స్ టోర్నీ ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్.. చాలెంజర్గా పోటీపడి ప్రపంచ చాంపియన్గానూ అవతరించిన సంగతి తెలిసిందే. ఆనంద్, గుకేశ్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ నెగ్గిన మూడో భారత ప్లేయర్గా వైశాలి నిలిచింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande