
హైదరాబాద్, 14 ఏప్రిల్ (హి.స.)
ఐపీఎల్ 2026 లో ఇవాళ మరో కీలక
మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, KKR జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి. ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ రెండు జట్లు కూడా పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉన్నాయి. ఒక మ్యాచ్ వర్షంతో రద్దు అయిన నేపథ్యంలో ఆడిన మూడు మ్యాచ్ లలో KKR ఓటమిపాలైంది. ఇక అటు చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయి, మొన్న ఢిల్లీపై విక్టరీ అందుకుంది. ఇవాళ కేకేఆర్ పై మరో విజయాన్ని నమోదు చేసుకొని, పాయింట్ల పట్టికలో మరింత ముందుకు దూసుకువెళ్లాలన్న కసితో చెన్నై సూపర్ కింగ్స్ కనిపిస్తోంది. ఇవాళ అయినా బోణీ కొట్టాలని అటు కేకేఆర్ సన్నద్ధమవుతోంది.
కేకేఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ( MS Dhoni ), తుది జట్టులో ఉంటాడని అంటున్నారు. గాయం కారణంగా మొదటి నాలుగు మ్యాచ్ లకు దూరమైన మహేంద్ర సింగ్ ధోని, నిన్న నెట్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో అతడు కోలుకున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంతా ఓకే అయితే, కచ్చితంగా బరిలోకి దిగుతాడు ధోని. ఇక ధోని రీ-ఎంట్రీ ఇస్తే చెన్నై సూపర్ కింగ్స్ ను ఆపడం ఎవరి తరం కాదని అంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు