రాజస్థాన్ ను వణికిస్తోన్న SRH రికార్డులు..మూడేళ్లుగా వార్ వన్ సైడే
రాజస్థాన్ ను వణికిస్తోన్న SRH రికార్డులు..మూడేళ్లుగా వార్ వన్ సైడే
IPL


మొహాలి (పంజాబ్,) 27 మే (హి.స.)

ఐపీఎల్ లో నేడు ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా SRH, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ముల్లాన్ పూర్ వేదికగా ఇవాళ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ షురూ కానుంది. ఇలాంటి నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ను గత రికార్డులు వణికిస్తున్నాయి. గడిచిన మూడు సంవత్సరాలుగా హైదరాబాద్ పైన ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్ లు జరిగాయి. ఈ ఐదింటిలో SRH బంపర్ విజయాలు నమోదు చేసుకుంది.

ఇక ఓవరాల్ గా ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివ రకు 23 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ 14 విజయం సాధించగా, తొమ్మిదింటిలో మాత్రమే రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఇవాల్టి మ్యాచ్ లో హైదరాబాద్ మళ్లీ విజయం సాధిస్తుందని క్రీడా విశ్లేషకులు కూడా చెబుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ కంటే అన్ని విభాగాల్లో హైదరాబాద్ చాలా బలంగా ఉందని స్పష్టం చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ వికెట్ పడగొడితే, SRH సగం మ్యాచ్ గెలిచినట్లేనని స్పష్టం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande