
అహ్మదాబాద్, 21 మే (హి.స.)
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్
టైటాన్స్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. లీగ్ స్టేజ్ లో రెండు జట్లకు ఇదే చివరి మ్యాచ్. ఇందులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే, పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులు జరగవు. భారీ తేడాతో గెలిస్తే, మొదటి స్థానానికి గుజరాత్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అటు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ఈ మ్యాచ్ లో సింపుల్ గా గెలవడం కాదు, రన్ రేట్ ను చెన్నై పెంచుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే ప్లే ఆఫ్స్ లోకి వెళ్లే అవకాశాలు మెరుగుపడతాయి.
ఇవాళ గుజరాత్ పైన చెన్నై సూపర్ కింగ్స్ ఛేజింగ్ చేస్తే, 17 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేయాలి. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, 25 పరుగుల తేడాతో గుజరాత్ పైన గెలవాలి. ఇది జరిగినప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ రన్ రేట్ మెరుగుపడుతుంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రెండిటిలో ఏది జరగకపోయినా, చెన్నై సూపర్ కింగ్స్ ఇంటి దారి పట్టాల్సిందే. అప్పుడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్లు... నాలుగో స్థానానికి పోటీ పడతాయి. మరి ఇవాళ అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి స్ట్రాటజీతో వస్తుందో చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..