ఐపీఎల్ లో నేడు గుజరాత్తో KKR కీలక మ్యాచ్.. ఓడితే ఇంటికే!
ఐపీఎల్ లో నేడు గుజరాత్తో KKR కీలక మ్యాచ్.. ఓడితే ఇంటికే!
IPL


కోల్కత్తా, 16 మే (హి.స.)

ఐపీఎల్ లో ఇవాళ కేకేఆర్, గుజరాత్

టైటాన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ రెండు జట్లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడతాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే, 18 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్లనుంది గుజరాత్ టైటాన్స్. మరోవైపు కేకేఆర్ ఓడితే మాత్రం ఇంటి దారి పట్టాల్సిందే. ఇప్పటిదాకా 11 మ్యాచ్ లలో నాలుగింటిలో గెలిచిన కేకేఆర్... ఆరింటిలో ఓడింది.

ఒక్క మ్యాచ్ రద్దు అయింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగతా మూడు మ్యాచ్ లలో కేకేఆర్ గెలవాలి. అదే సమయంలో ఇతర టీమ్స్ గెలుపోటములపైన కేకేఆర్ ఆధార పడాల్సి వస్తుంది. దీంతో ఎలాగైనా గెలవాలన్న కసితో కేకేఆర్ ప్లేయర్లు బరిలో దిగుతున్నారు. అటు బలమైన ఓపెనర్లు, సత్తా ఉన్న ఫాస్ట్ బౌలర్లతో గుజరాత్ కూడా ఏ మాత్రం తక్కువేం లేదు. ఈడెన్ గార్డెన్స్ వేదిక అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తోంది. మరి ఈ మ్యాచ్ లో పంజా ఎవరు విసురుతారో చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande