ఐపీఎల్ లో నేడు పంజాబ్ తో కీలక మ్యాచ్.. ఓడితే ఢిల్లీ ఇంటికే !
ఐపీఎల్ లో నేడు పంజాబ్ తో కీలక మ్యాచ్.. ఓడితే ఢిల్లీ ఇంటికే !
Ipl


ధర్మశాల, 11 మే (హి.స.)

ఐపీఎల్ 2026లో ఇవాళ మరో కీలక

మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. ఇందులో పంజాబ్ కింగ్స్ గెలిస్తే 15 పాయింట్లతో, బెంగళూరును వెనక్కి నెట్టి టేబుల్ లో మళ్ళీ టాప్ ప్లేస్ కు చేరుకుంటుంది. మరోవైపు ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే, అధికారికంగా టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ కానుంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్, కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.

మిగతా మూడు మ్యాచ్ ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కచ్చితంగా గెలవాలి. అది కూడా భారీ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇది అసాధ్యమని అంటున్నారు. అంటే దాదాపుగా ఢిల్లీ క్యాపిటల్స్ పని అయిపోయినట్టేనన్నమాట. కాగా ఇప్పటి వరకు ఢిల్లీ, పంజాబ్ కింగ్స్ 36 సార్లు తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 17 సార్లు గెలవగా, పంజాబ్ 18 సార్లు విజయం సాధించింది. కాగా ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande