ఐపీఎల్ లో ఉప్పల్ వేదికగా నేడు ఢిల్లీతో సన్ రైజర్స్ ఫైట్..
ఐపీఎల్ లో ఉప్పల్ వేదికగా నేడు ఢిల్లీతో సన్ రైజర్స్ ఫైట్..
ఐపీఎల్


హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)

సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక

మ్యాచ్ కు సిద్ధం అవుతోంది. ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి బలమైన జట్టుతో హైదరాబాద్ తలపడనుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగానే ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు నెట్స్ లో చెమటోడ్చుతున్నాయి. ఇందులో గెలవడం రెండు జట్లకు చాలా కీలకము. ఈ నేపథ్యంలోనే తెగ కష్టపడుతున్నారు ప్లేయర్లు. అయితే ఢిల్లీతో జరిగే మ్యాచ్ కూడా కమిన్స్ అందుబాటులో ఉండబోడని తెలుస్తోంది. ఈ నెల 24 తర్వాతే తుది జట్టులో ఉంటాడని సమాచారం. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన తుది జట్టుతోనే బరిలోకి దిగనుంది హైదరాబాద్..

ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో 6 మ్యాచ్ లు ఆడింది హైదరాబాద్. ఇందులో మూడింటిలో గెలవగా, మిగిలిన మూడింటిలో ఓడిపోయింది. గత రెండు మ్యాచ్ లలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపైన సూపర్ విక్టరీ అందుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఢిల్లీ పైన విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలన్న కసితో హైదరాబాద్ ప్లేయర్లు కనిపిస్తున్నారు. మొన్నటి వరకు హైదరాబాద్ బౌలింగ్ సరిగ్గా లేదని చాలా మంది ట్రోల్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ సమస్య సెట్ అయింది. గడిచిన రెండు మ్యాచ్ లలో కూడా హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఢిల్లీపైన కూడా అదే స్థాయిలో రాణిస్తే కచ్చితంగా మరో విక్టరీ కొడుతుంది SRH.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande