SRH vs CSK మ్యాచ్కు వర్షం ముప్పు.. చెన్నైలో ఈ రాత్రి వర్ష సూచన
SRH vs CSK మ్యాచ్కు వర్షం ముప్పు.. చెన్నైలో ఈ రాత్రి వర్ష సూచన
Ipl


చెన్నై, 18 మే (హి.స.)

ఐపీఎల్ 2026 లో భాగంగా ఈరోజు

సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్ రేసులో అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచులో ఆడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో SRH vs CSK మ్యాచ్ పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ చివరి నిమిషంలో చెన్నై వాతావరణ శాఖ ఉహించని ట్విస్ట్ ఇచ్చింది. నేటి మ్యాచ్ కి వర్షం ముప్పు ఉందని, రాత్రి చెపాక్ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం అంచనా వేసింది. టాస్ పడే సమయానికి (సాయంత్రం 6:30 PM) 36 శాతం వర్షం పడే ఛాన్స్ ఉండగా, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి (రాత్రి 7:30 PM) అది 25 శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు.

రాత్రి 8:30 గంటల తర్వాత వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఒకవేళ సాయంత్రం వాన పడితే ఆట ప్రారంభం కావడంలో కొంత సమయం పాటు ఆలస్యం కావచ్చు. అయితే చేపాక్ స్టేడియంలో ఉన్న అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ కారణంగా.. మ్యాచ్ పూర్తిగా రద్దవడం (Washout) గానీ, లేదా ఓవర్లను భారీగా తగ్గించడం గానీ జరగకపోవచ్చని తెలుస్తోంది. అభిమానులకు పూర్తి 20 ఓవర్ల వినోదం దక్కడం ఖాయమని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ఒక వేళ ఊహించని స్థాయిలో వర్షం కంటిన్యూగా పడి మ్యాచ్ రద్దైతే మాత్రం చెరొక పాయింట్ వస్తుందని. దీంతో సన్ రైజర్స్ జట్టు ప్లే ఆఫ్కు అర్హత సాదించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande