ఐపీఎల్ లో నేడు తాడోపేడో తేల్చుకోనున్న గుజరాత్, రాజస్థాన్.. అందరి దృష్టి ఆ కుర్రాడిపైనే
ఐపీఎల్ లో నేడు తాడోపేడో తేల్చుకోనున్న గుజరాత్, రాజస్థాన్.. అందరి దృష్టి ఆ కుర్రాడిపైనే
Ipl


మొహాలి (పంజాబ్,) 29 మే (హి.స.)

ఐపీఎల్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్లో గుజరాత్ టైటాన్స్పై నెగి టైటిల్ పోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరో ఫైనలిస్ట్ను తేల్చే పోరు నేడే. ముల్లాన్పూర్ వేదికగానే శుక్రవారం క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు ఫైనల్లో ఆర్సీబీని డీకొట్టనుంది. బెంగళూరు చేతిలో ఓటమితో జీటీ నిరాశలో ఉండగా.. ఎలిమినేటర్లో సన్రైజర్స్ హైదరాబాద్్ప సంచలన విజయంతో ఆర్ఆర్ ఆత్మవిశ్వాసంతో ఉంది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండటంతో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. లీగ్ దశలో ఇరు జట్లు రెండుసార్లు తలపడగా.. చెరో విజయాన్ని నమోదు చేశాయి. మరి, కీలకమైన క్వాలిఫయర్-2లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన తీరు రాజస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్లో తమ బలాన్ని తెలియజేసింది. బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ ఆ జట్టుకు ప్రధాన బలం. అతను 15 మ్యాచ్లో 680 రన్స్ చేశాడు. స్ట్రైక్తేట్ 242.85 ఉండటం విశేసం. ప్రస్తుతం ఈ సీజన్లో అత్యధిక స్కోరు చేసింది అతనే. వైభవ్ తర్వాత ధ్రువ్ జురెల్ నిలకడగా రాణిస్తున్నాడు. 15 మ్యాచ్లో 508 పరుగులు చేశాడు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(426) కూడా టచ్లోనే ఉన్నాడు. కానీ, నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. గత ఆరు ఇన్నింగ్స్ ల్లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ప్రధాన ఆర్ఆర్ బ్యాటింగ్ వైభవ్, జురెల్ మీదనే ఆధారపడింది. కెప్టెన్ రియాన్ పరాగ్, జడేజా, ఫెరీరా, హెట్మేయర్, షనక వంటి వారు ఆకట్టుకోవడం లేదు. టాపార్డర్ బలంగానే ఉన్నా మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లో రాజస్థాన్ బలహీనంగా ఉంది. ఇక, బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ ఆర్ఆర్ కీలకంగా మారాడు. 15 మ్యాచ్లో 21 వికెట్లు తీశాడు. అతని తర్వాత నాండ్రే బర్గర్, బ్రిజేశ్ శర్మ ఆకట్టుకుంటున్నారు. జీటీ బౌలింగ్ తో పోలిస్తే రాజస్థాన్ బౌలింగ్ బలహీనంగానే ఉందని చెప్పొచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande