బరితెగించిన కేటుగాళ్లు.. సీపీ సజ్జనార్ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా
హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.) హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించి, ఏకంగా తన స్నేహితుడికే వలవేసి 20 వేలు స్వాహా చేసినట్టు కమిషనర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి త
సిపి సజ్జనార్


హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.) హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్

పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించి, ఏకంగా తన స్నేహితుడికే వలవేసి 20 వేలు స్వాహా చేసినట్టు కమిషనర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి తన స్నేహితులకు అవసరం ఉందని డబ్బులు అడుగుతున్నారని, అటువంటి నకిలీ ఖాతాలపై ఎవరు స్పందించ వద్దని సజ్జనార్ తెలిపారు.

నకిలీ ఫేస్ బుక్ ఖాతా లో మెసేజ్ నిజమని నమ్మిన ఓ స్నేహితుడు రూ.20 వేలు పంపి మోసపోయారని తెలిపారు. డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande