
న్యూఢిల్లీ, 15 నవంబర్ (హి.స.) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్దరామయ్య, కర్నాటక కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ. వేణుగోపాల్ సైతం హాజరయ్యారు. అదే విధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..