
హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ
విజయంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటర్లు చావుదెబ్బ కొట్టినా కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని విమర్శించారు. రాజకీయంగా పతనమైనా ఆయన తీరు మారలేదన్నారు. కేటీఆర్ తోనే బీఆర్ఎస్ పతనమవ్వడం ఖాయమన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి అనీ తానై నడిపించారని కొనియాడారు. రాజకీయంగా కేసీఆర్ మాట్లాడితే ప్రవచనాల్లాగా.. సీఎం రేవంత్ కౌంటరిస్తే బూతుల్లాగా వినిపిస్తున్నాయా? అని కేటీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కు రాజకీయ మిత్రుత్వం ఉందన్నారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని కేటీఆర్ అంటున్నారని, అరెస్ట్ చేయడానికి దమ్ము ఉండనక్కర్లేదని, పోలీసులకు చెబితే చేస్తారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..