
హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.)
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న
మొదటి టెస్టు మ్యాచు లో బౌలర్లు రెచ్చిపోతున్నారు. మొదటి రోజు టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలింగ్ దాటికి కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ మొదటి సెషన్లో లోకేష్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ జాగ్రత్తగా ఆడి వికెట్లు కోల్పోలేదు. లంచ్ సమయానికి భారత్ 138/4తో బాగానే కనిపించింది. కానీ విరామం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లంచ్ అనంతరం బ్యాటింగ్కు వచ్చిన భారత బ్యాటర్లకు సైతం సౌతాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు.
కేఎల్ రాహుల్ 39, సుందర్ 29, పంత్ 27, జడేజా 27 పరుగులు మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్ గిల్ రిటైర్డ్ హట్ తో వెళ్లిపోగా.. 62 ఓవర్లకు భారత్ 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జెన్ సన్ 3 వికెట్లు తీసుకోగా, హార్మెర్ 4, మహారాజ్, బోస్చ్ చెరో వికెట్ పడగొట్టారు. దీంతో భారత్ కేవలం 30 పరుగుల లీడ్ సాధించి ఆలౌట్ అయింది. ఈ రోజు ఆటలో మరో 42 ఓవర్లు మిగిలి ఉన్నాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..