వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కృషి.. డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.) ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. శనివారం విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో దివంగత ప్రధాని నెహ్రూ 80వ సైంటిఫిక్ టెంపర్మెంట్ సెలెబ్రేషన్స్లోలో భట్టి విక్రమార్క పాల్గొన
ఉప ముఖ్యమంత్రి


హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.)

ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను

తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. శనివారం విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో దివంగత ప్రధాని నెహ్రూ 80వ సైంటిఫిక్ టెంపర్మెంట్ సెలెబ్రేషన్స్లోలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశానికి తొలి ప్రధాని కావడంతో సైన్స్లోనే కాకుండా ప్రజాస్వామ్యంలోనూ ప్రపంచంతో పోటీ పడుతున్నామని అన్నారు. తొలి ప్రధానిగా నెహ్రూ లేకపోతే దేశ పరిస్థితిని ఊహించుకోలేమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతితోనే దేశం బలోపేతమవుతుందని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రధాని కాకపోయిఉంటే దేశం దయనీయ స్థితిలో ఉండేదన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande