ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: జగిత్యాల జిల్లా కలెక్టర్
జగిత్యాల, 15 నవంబర్ (హి.స.) ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు. మండల కేంద్రం తో పాటుగా బతికేపల్లి అనుబంధమైన కొండయ్య పల్లె లో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర
జగిత్యాల కలెక్టర్


జగిత్యాల, 15 నవంబర్ (హి.స.)

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు. మండల కేంద్రం తో పాటుగా బతికేపల్లి అనుబంధమైన కొండయ్య పల్లె లో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేస్తూ మిల్లులకు తరలించాలని తూకం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. క్రమపద్ధతిలో తూకం వేస్తూ మిల్లులకు తరలించాలని రైతులు నియమాల ప్రకారం.. తేమ శాతం వచ్చేలా చూడాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande