
న్యూఢిల్లీ, 15 నవంబర్ (హి.స.)
బిహార్ లో ఎన్డీయే కూటమి భారీ
విజయం సాధించిన కొద్ది గంటల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి, ఆరా మాజీ ఎంపీ ఆర్కే సింగ్ ను పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, నాయకత్వంపై విమర్శలు, ఎన్నికల సమయంలో చట్టం-వ్యవస్థ వ్యవహారాలపై ఎలక్షన్ కమిషన్ను నేరుగా ప్రశ్నించినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నట్లు బీజేపీ తెలిపింది. సింగ్తో పాటు ఎంఎల్సీ అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..