
హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.)
చింత చచ్చినా పులుపు తగ్గన్నట్లుగా కేటీఆర్ పరిస్థితి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓడిపోయినప్పటికి జూబ్లీహిల్స్ లో ఆయనలో చిత్తుగా అహంకారం ఇసుమంతైనా తగ్గలేదని ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. జనం ఛీ కొట్టి 12 గంటలు కాకముందే మీడియా ముందుకు వచ్చి తన బలుపును చూపిస్తున్నాడని ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ గుర్తును గాడిదపై ఎక్కించి ఊరేగింపులు చేశామా అంటు అహంకారపు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో జిమ్మిక్కులు చేసి ప్రజల చైతన్యం ముందు చిత్తైనా కేటీఆర్ సిగ్గు రావడం లేదని తీవ్ర విమర్శలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు