ప్రాజెక్టుల పేరుతో చిన్న రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం.. జాగృతి కవిత
మెదక్, 15 నవంబర్ (హి.స.) మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట పర్యటనలో భాగంగా ఈ రోజు మెదక్ జిల్లాలో పర్యటించారు. మీడియాతో ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఎన్నో సంవత్సరాలు బీఆర్ఎస్ కోసం పన
జాగృతి కవిత


మెదక్, 15 నవంబర్ (హి.స.)

మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు

కవిత జనం బాట పర్యటనలో భాగంగా ఈ రోజు మెదక్ జిల్లాలో పర్యటించారు. మీడియాతో ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఎన్నో సంవత్సరాలు బీఆర్ఎస్ కోసం పని చేసిన తనను పార్టీ నుంచి తప్పించినా, ప్రజల కోసం మాత్రం నిరంతరం నిలబడతానని స్పష్టం చేశారు. మెదక్ అంటే “నెక్ట్స్ న్యూయార్క్ అనుకున్నప్పటికీ.. ఇక్కడ ఉన్న పరిస్థితి మాత్రం దయనీయంగా ఉందని ఆమె అన్నారు.

ఆర్ఆర్ఆర్, కాళేశ్వరం, రైల్వే లైన్ వంటి ప్రాజెక్టుల పేరుతో చిన్న రైతుల భూములను త్యాగం చేయిస్తున్నారని, కొంతమంది బీఆర్ఎస్ నాయకుల ప్రయోజనాల కోసం ఆలైన్మెంట్లు మార్పులు చేశారని ప్రజలే చెబుతున్నారన్నారని గుర్తు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande