కాంగ్రెస్ గెలిచి 24 గంటలు కాకముందే బీఆర్ఎస్ నాయకులపై దాడులు : కేటీఆర్
హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం మాగంటి సునీత కుటుంబ సభ్యులను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన తీరును ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహి
కేటీఆర్


హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం మాగంటి సునీత కుటుంబ సభ్యులను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన తీరును ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగారు అన్నారు.

మా హయాంలో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా నాయకులు, కార్యకర్తలు ఇలా హద్దులు దాటి ఏనాడైనా దాడులు చేశారా, నిన్న కారు గుర్తును అవహేళన చేశారు. మేము 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచాం కానీ విర్రవీగలేదని, కాంగ్రెస్ పార్టీ నేతల్లా చిల్లరగా ప్రవర్తించలేదని కేటీఆర్ గుర్తు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande