
హైదరాబాద్, 15 నవంబర్ (హి.స.)
ఆర్టీఏ నిర్వహించిన ఆన్లైన్ వేలంపాటలో TG09H9999 నెంబర్ అత్యధికంగా రూ.22.72 లక్షల వరకు పలకగా, TG09J0003 నంబర్ రూ.1.15 లక్షల వరకు ధర పలికింది. TG09J0009 నంబర్ కోసం జరిగిన పోటీలో డండు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.6,80,000 చెల్లించి నెంబర్ను సొంతం చేసుకుంది. TG09J0006 కోసం సాయి సిల్క్ కళామందిర్ లిమిటెడ్ రూ.5.70లక్షల వరకు చెల్లించింది. TG09J0099 నెంబర్ను గోదావరి ఫార్చ్యూన్ సంస్థ రూ.3.40లక్షలకు, TG09J0001 నంబర్ను శ్రీనిధి ఐటీ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2.60లక్షలు చెల్లించి పొందాయ.
నిహారిక ఎంటర్టైన్మెంట్ TG09J0005 నంబర్ను రూ.2.40లక్షలు చెల్లించి పొందగా, TG09J0018 నంబర్ను రోహిత్ రెడ్డి ముత్తు రూ.1.71 లక్షలకు కొనుగోలు చేశారు. TG09J0007 నంబర్ను కొండవరపు శ్రీనివాస్ నాయుడు రూ.1.69లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. TG09J0077 నంబర్ను మీనాక్షి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1.41 లక్షలను చెల్లించి విజయవంతంగా బిడ్ గెలిచింది. ఇక TG09J0123 నెంబర్ను రూ.1.19లక్షలు చెల్లించి అకుల మాధురి దక్కించుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..