
నిజామాబాద్, 15 నవంబర్ (హి.స.)
మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గాను నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని ప్రభుత్వ సలహాదారు, బోధన్ శాసన సభ్యులు పి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 2025 2026 సంవత్సరానికి వంద శాతం సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం ఎడపల్లి మండలం జానకంపేట్ లోని అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి సుదర్శన్ రెడ్డి చేప పిల్లలను లాంఛనంగా వదిలారు. జిల్లావ్యాప్తంగా ఈ సీజన్ లో 4.54 కోట్ల చేప పిల్లలను పెంపకం నిమిత్తం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు