
మహబూబ్నగర్, 15 నవంబర్ (హి.స.) వృద్ధులను గౌరవించటం మనందరం బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలలో భాగంగా శనివారం స్టేడియం గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు వృద్ధుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై నిర్వహించిన 'అవగాహన ర్యాలీ' ని కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించి ప్రసంగించారు. వృద్ధుల పట్ల గౌరవంగా, దయతో వ్యవహరించాలని, వారి అవసరాలను అర్థం చేసుకోవాలని, వారి మానసిక స్థితిని గ్రహించి మసలుకోవాలన్నారు. తల్లిదండ్రులను ముదిమి వయసులో విడదీయ్యకుండా, వారిని పంచుకోవాలనే ఆలోచనలను రానీవ్వకండని హితవు పలికారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద వృద్ధుల పట్ల వ్యవహరించాల్సిన ప్రవర్తనపై ప్రతిజ్ఞ చేయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..