పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్, 15 నవంబర్ (హిం.స) నిజామాబాద్ జిల్లా లోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో శనివారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్త భవన నిర్మాణ పనులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.మాజీ రాజ్యసభ సభ్యుడు జోగ
ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి


నిజామాబాద్, 15 నవంబర్ (హిం.స)

నిజామాబాద్ జిల్లా లోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో శనివారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్త భవన నిర్మాణ పనులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అందించిన రూ.1.03 కోట్ల నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... స్వంత గ్రామ అభివృద్ధికి సుమారు రూ.2.20 లక్షల నిధులు మంజూరు చేసిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande