పెండింగ్ లో ఉన్న రూ.15కోట్ల నిధులు మంజూరు : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
సిద్దిపేట, 15 నవంబర్ (హి.స.) దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన నిధులు పెండింగ్ లో ఉన్న రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ఎమ
ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి


సిద్దిపేట, 15 నవంబర్ (హి.స.) దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన నిధులు పెండింగ్ లో ఉన్న రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన సీఎం సహాయనిధి 141 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోనిలోని ఉన్న 20 వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఇటీవలి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే కొద్ది రోజులుగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పెండింగ్లో ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ లో ఉన్న నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande