రోడ్డెక్కిన కాలనీ వాసులు.. జేసీబీతో రోడ్డు తవ్వేసి నిరసన!
వికారాబాద్, 15 నవంబర్ (హి.స.) రోడ్డు కోసం రోడ్డు ఎక్కి నిరసన తెలిపిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా మా బతుకులు మారడం లేదని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ వాసులు శనివారం రోడ్డెక్కి నిరసన
రోడ్డు కోసం ఆందోళన


వికారాబాద్, 15 నవంబర్ (హి.స.)

రోడ్డు కోసం రోడ్డు ఎక్కి నిరసన తెలిపిన సంఘటన

వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా మా బతుకులు మారడం లేదని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ వాసులు శనివారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. జెసిబి తో రోడ్డును తవ్వి వారు నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

వాహనదారులు కొన్ని ఏళ్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కొత్త రోడ్డును వెంటనే వేయాలంటూ ఆందోళన చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రావాలి అంటూ డిమాండ్ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రోడ్డును త్వరలోనే వేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాలనీ వాసులు శాంతించి ఆందోళన విరమించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande