
చెన్నై, 15 నవంబర్ (హి.స.)
తమిళనాడులో జరిగే ఎన్నికల్లో తమ
పార్టీకి కామన్ సింబల్ కేటాయించాలని తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ కోరింది. ఇటీవల భారత ఎన్నికల కమిషన్ కు సింబల్ కోసం దరఖాస్తు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల సన్నాహక సమావేశాలకు టీవీకే కూడా ఆహ్వానించాలని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ (Joseph Vijay) కోరారు. భారత ఎన్నికల కమిషనుకు శనివారం లేఖను రాశారు. ఎన్నికల పారదర్శకత, సమగ్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపన అనే లక్ష్యంతో తమ పార్టీ కూడా ఎన్నికల సన్నాహక చర్చల్లో భాగమవ్వాలని కోరుకుంటోందని ఎన్నికల కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..