
వనపర్తి, 15 నవంబర్ (హి.స.)
వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు
ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అధికారులను, కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.
శనివారం పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మేఘా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి రైతుల ధాన్యాన్ని లారీల లోకి ఎత్తిన తర్వాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని ఏ సమస్యలున్నా కొనుగోలు కేంద్రంలోనే పరిష్కరించి ధాన్యాన్ని తీసుకోవాలని మిల్లర్లతో రైతులకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..