
యాదాద్రి భువనగిరి, 15 నవంబర్ (హి.స.)
మధ్యాహ్న భోజనం పట్ల ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం తగదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మోటకొండూరు మండలంలోని చాడ ఉన్నత పాఠశాలలో శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతీరోజు ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని రుచిగా వండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. మరుగుదొడ్లు, వంటశాల గదులను ఆయన పరిశీలించారు. జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో బాలురు, బాలికల టీంలు మొదటి ద్వితీయ పథకాలు సాధించిన విషయం తెలుసుకొని వారిని అభినందించి విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు