
విజయవాడ, 15 నవంబర్ (హి.స.) సింగపూర్ - విజయవాడ(Singapore - Vijayawada) మధ్య నేరుగా విమాన సర్వీసులు(Air services) ఈ రోజు ప్రారంభమయ్యాయి.
గతంలో కేంద్రం చెప్పినట్లుగా నేటి నుంచి ఇండిగో మొదటి ఫ్లైట్ గన్నవరం ఎయిర్ పోర్టు(Gannavaram Airport) నుంచి ప్రారంభమైంది. వారానికి మూడు రోజుల పాటు సర్వీసులు విజయవాడ- సింగపూర్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. దీంతో ఈ రోజు ప్రయాణికులు ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu)కి, మంత్రి లోకేష్(Minister Lokesh)కి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV