
చతిస్గడ్, 15 నవంబర్ (హి.స.)
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా, బాసగూడ
పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుట్ కేల్ గ్రామానికి చెందిన సోయం ధర్మయ్య అనే గ్రామస్థుడిని ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనతో భయానక వాతావరణం నెలకొంది. మావోయిస్టుల సమాచారం పోలీసులకు అందజేస్తూ, పార్టీకి నష్టం కలిగిస్తున్నాడని ఆరోపిస్తూ ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు