
జహీరాబాద్, 15 నవంబర్ (హి.స.)
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్సర్చ్ నిర్వహించామని జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ అన్నారు. శనివారం ఉదయం జహీరాబాద్ పట్టణంలోని భారత్ నగర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీలు చేశారు. కాలనీలో ఉంటున్న కుటుంబాల సమాచారాన్ని సేకరించారు. సోదాల్లో భాగంగా ఓ వ్యక్తి వద్ద ఎయిర్ గన్, దుప్పి కొమ్ములు లభించాయి. అలాగే సరైన పత్రాలు లేని 32 బైకులు, 14 ఆటోలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు