రాష్ట్రానికి గుడ్ న్యూస్.. 3 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సీఎం శంకుస్థానలు
ఈ రోజు కూడా పెట్టుబడులు జోరు
రాష్ట్రానికి గుడ్ న్యూస్.. 3 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సీఎం శంకుస్థానలు


విశాఖపట్టం, 15 నవంబర్ (హి.స.)

రాష్ట్రానికి ఈ రోజు కూడా గుడ్ న్యూస్ లభించింది. విశాఖ(Visakha)లో జరుగుతున్న సీఐఐ సదస్సు(CII conference) ద్వారా భారీగా పెట్టుబుడుల వస్తున్నాయి. తొలి రోజు దాదాపు 12 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకోవడంతో పాటు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు జరిగాయి.

అయితే ఈ రోజు కూడా పెట్టుబడులు జోరు కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ రోజు మూడు ప్రాజెక్టులకు శ్రీకారం చేశారు. రూ.1201 కోట్ల పెట్టుబడితో రేవండ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చంద్రబాబు(Chandrababu) వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూపు ఎండీ గౌతమ్ మైనీ(Raymond Group MD Gautam Maini) సైతం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అనంతపురం జిల్లా(Anantapur District)లో ఏరోస్పేస్ పరిశ్రమ(Aerospace industry)ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే సదస్సులో చేసుకుంటున్న ఒప్పందాలతో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

-------------

--

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande